తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి

అనంతపురం(కదిరి): కదిరి ఎమ్మెల్యే  అత్తార్ చాంద్ బాషా వాహనంపై జరిగిన దాడి ముమ్మాటికి అది హత్యాయత్నమేనని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. నేరుగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేక కొందరు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. గతంలోనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తామంటూ ఫోన్ చేసి బెదిరించారని నేతలు చెప్పారు. ఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.

Back to Top