చంద్రబాబు దాష్టీకం

  • మహాత్ముల విగ్రహాలకు రక్షణ లేకుండా పోయింది
  • బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
విజయవాడ: ప్రతిపక్ష నేత వైయస్ జగన్ టీడీపీ సర్కార్ పై మండిపడ్డారు. ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని పగులగొట్టి బుడమేరు కాల్వలో పడేయటం చంద్రబాబునాయుడి దాష్టికానికి నిదర్శనం అని అన్నారు. బాబు పాలనలో గాంధీజీ, వైయస్సార్ విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కృష్ణపుష్కరాల్లో భాగంగా పున్నమి ఘాట్ లో స్నానమాచరించిన అనంతరం వైయస్ జగన్ ఇబ్రహీం పట్నం వెళ్లారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గాలకు ఆ దేవుడే మొట్టికాయలు వేయాలని అన్నారు. చంద్రబాబు ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుందని, ఆయనకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 

Back to Top