అబ్దుల్లాపురంలో పంట పొలాల పరిశీలన


  • మూడవ రోజు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర


  • నోట్ల రద్దుతో రైతాంగం కుదేలు


  • రైతులు, కూలీల కష్టాలు తెలుసుకున్న జననేత


  • రెండేళ్లలో రైతు ప్రభుత్వం వస్తుందని భరోసా 


  • రైతుల గోడు పట్టని సర్కార్ పై జగన్ ఫైర్

కర్నూలు: కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో రైతాంగం కుదేలైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజు కర్నూలు జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామ పరిధిలోని పంట పొలాలను ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ పరిశీలించారు. రైతులు, కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు తమకు రోజుకు రూ.130 నుంచి రూ.150 మించి రావడం లేదని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గాయని తెలిపారు. 

గతేడాది మినుము ఎకరాకు 10 క్వింటాళ్లు వచ్చిందని, ఈ ఏడాది మూడు, నాలుగు క్వింటాళ్లకే పరిమితమవుతుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు. బ్యాంకుకు పోతే రూ.2 వేల నోట్లు ఇస్తున్నారని, వాటికి చిల్లర దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పనులు మానుకొని బ్యాంకుల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తుందని చెప్పారు. రోజంతా బ్యాంకు వద్ద పడిగాపులు కాసిన రూ.2 వేలు, రూ.4 వేలకు మించి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. మరో రెండేళ్లలో రైతు ప్రభుత్వం వస్తుందని వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top