క్రికెట్ టోర్న‌మెంట్ ప్రారంభం

ప్ర‌కాశం: గిద్దలూరు మండలం ఓబుళాపురం గ్రామంలో ఈస్టర్ పండుగ‌ను పుర‌స్క‌రించుకొని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్న‌మెంట్‌ను పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐ.వి.రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..క్రీడ‌ల‌తో మాన‌సిక ఉల్లాసం క‌లుగుతుంద‌న్నారు. అంతేకాకుండా స్నేహ‌భావం పెంపొందుతుంద‌ని చెప్పారు. యువ‌కులు క్రికెట్‌లో రాణించి నియోజ‌క‌వ‌ర్గానికి మంచి పేరు తీసుకురావాల‌ని ఆకాంక్షించారు. కార్యక్ర‌మంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి విజయం భాస్కర్ రెడ్డి, నాయ‌కుడు పల్లా ప్రతాప్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top