<strong>విజయనగరంః </strong>ప్రజా సంకల్పయాత్రలో జ్యూట్‌మిల్లు మహిళా కార్మికులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిన కలుసుకుని తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లు పనిచేసిన ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదని జననేత దృష్టికి తీసుకెళ్లారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకు నివసిస్తున్నామని, మిల్లు యాజమాన్యం తమకు రావాల్సిన గ్రాట్యూటి, పిఎఫ్‌లు నిలుపుదల చేశారన్నారు. అడిగితే ఇళ్లు ఖాళీ చేస్తే ఇస్తామని చెప్పుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. కేసులు కూడా బనాయించి రిటైర్ అయిన తమకు మన.శాంతి లేకుండా చేస్తూ తమ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ఇళ్లు ఖాళీ చేయాలని యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని వాపోయారు. టీడీపీ ప్రభుత్వం అందరికి ఇళ్లు స్కీం అమలు చేస్తున్నామని చెప్పుతున్నా కనీసం ఇళ్లు పట్టాలు కూడా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వస్తే మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నామన్నారు. న్యాయం చేస్తామని జననేత హామీ ఇచ్చారని కార్మికులు చెప్పారు.