త్వ‌ర‌లో మంచి రోజులు వ‌స్తాయి- ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పిన వైయ‌స్ జ‌గ‌న్‌
తూర్పు గోదావ‌రి జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున క‌లుస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. కాగా ఈ రోజు కుమారి అనే దివ్యాంగురాలు జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ క‌ష్టాన్ని చెప్పుకుంది. గ‌త నాలుగేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని, త‌న‌ను ఆదుకోవాల‌ని కోరింది. అనంత‌రం త‌మ‌కు ఉద్యోగ భద్ర‌త క‌ల్పించాలంటూ స‌ర్వ‌శిక్ష అభియాన్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ టీచ‌ర్లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ గోడును వెల్ల‌బోసుకున్నారు. బాబు పాల‌న‌లో న‌ర‌కం అనుభ‌విస్తున్నామ‌న్నారు. వారి బాధ‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రొక్క ఏడాది ఓపిక ప‌ట్టాల‌ని, త్వ‌ర‌లోనే మంచి రోజులు వ‌స్తాయ‌ని వారికి ధైర్యం చెప్పారు. 
Back to Top