నవరత్నాలు కాదు..దశ రత్నాలు


సీపీఎస్‌ ఉద్యోగుల హర్షం
తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ ప్రకటించింది నవరత్నాలు కాదని దశరత్నాలని సీపీఎస్‌ ఉద్యోగులు అభివర్ణించారు.  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామన్న వైయస్‌ జగన్‌ ప్రకటనతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో సీపీఎస్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వైయస్‌ జగన్‌ సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, మా కోసం ప్రకటించిన హామీతో కలిపి దాన్ని దశ రత్నాలుగా పిలుచుకుంటున్నామని చెప్పారు. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న జగనన్న హామీతో మేమంతా తుది శ్వాస వరకు ఆయనకు అండగా ఉంటామని పేర్కొన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాల్లో వైయస్‌ జగన్‌ దైవంలా ఉంటారని చెప్పారు.


 
Back to Top