నిరసన సభకు రావాలని జననేతకు ఆహ్వానం

విశాఖపట్నం: సెప్టెంబర్‌ 1వ తేదీన విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్న ధర్నా, సీపీఎస్‌ నిరసన సభకు హాజరుకావాలని సీపీఎస్‌ విధానం వల్ల నష్టపోతున్న ఉద్యోగులంతా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. టీడీపీ పాలనలో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ లేకుండా సీపీఎస్‌ విధానాన్ని అమలు చేశారన్నారు. ఉద్యోగులంతా ఏకతాటిపై చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించిన జననేత వారం రోజుల్లోనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటనలతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చిందన్నారు. 
 
Back to Top