టీడీపీది పిరికి పంద చ‌ర్య‌

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు
గుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌ను అణ‌చివేయాల‌న్న దుర్మార్గ‌పు ఆలోచ‌న‌తో అక్ర‌మ కేసులు బ‌నాయించిన టీడీపీది పిరికి పంద చ‌ర్యగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అభివ‌ర్ణించారు. ఇటీవ‌ల అక్ర‌మ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభ‌వించి బుధ‌వారం విడుద‌లైన స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను అంబ‌టి రాంబాబు, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ..చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని అక్ర‌మాల‌కు తెర లేపార‌ని మండిప‌డ్డారు. ఏదైనా మంచి ప‌ని చేసి కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను త‌మ పార్టీ వైపు తిప్పుకోవాలని, ఇలా అక్ర‌మ కేసులు బ‌నాయిస్తే ఎవ‌రూ మీ పార్టీలోకి రార‌న్నారు. టీడీపీ నేత‌లు ఇక‌నైనా ఇలాంటి సంస్కృతికి స్వ‌స్తీ చెప్పాల‌ని సూచించారు. లేదంటే ప్ర‌జ‌లు తిరుగ‌బ‌డే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని అంబ‌టి హెచ్చ‌రించారు.
Back to Top