బాబుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది

  • పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా ఉండడం సరికాదు
  • రోజాను అక్రమంగా నిర్బంధించి ఆమె హక్కులు కాలరాశారు
  • చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
  • వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ సిటీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా పోలీసు సంఘాలు నిరసన తెలపడం బాధాకరమని ఆయన అన్నారు. పోలీసులే నిరసన తెలిపితే మిమ్మల్ని ఎవరు అరెస్టు చేయాలని శ్రీనివాస్‌ ప్రశ్నించారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే రోజాను అక్రమంగా నిర్భందించి ఆమె హక్కులు కాలరాశారని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఆ సమయంలో రోజా ఎవరినైనా కించపరిచి మాట్లాడారా? ఒక మహిళను 8 గంటల పాటు కారులో నిర్భందిస్తే..ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.  పోలీసులు ఆమెకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడంపై స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌ రావు, చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. పోలీసు సంఘాలు అధికార పార్టీకి తొత్తులుగా మాట్లాడటం, సీఎం చెప్పినట్లు చేసుకుంటూ పోవడం సరికాదని హెచ్చరించారు. 

ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులను ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టు చేస్తారా? వైయస్‌ జగన్‌ ఉన్న వాస్తవాలనే మాట్లాడుతున్నారు.  చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. హోదా, రైల్వే జోన్, కడప ఉక్కు ప్యాక్టరీని తాకట్టు పెట్టారు. మీకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీవి అన్నీ ప్రచార ఆర్భాటాలేనని దుయ్యబట్టారు. ఊకదంపుడు ఉపన్యాసాలు మాని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  వైయస్‌ జగన్‌ ఉద్యమ భేరి మోగిస్తున్నారని, ప్రజల కోసం పోరాటం చేస్తే ఎన్ని రోజులు అరెస్టు చేస్తారో చూస్తాం... వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బాబుకు వార్నింగ్ ఇచ్చారు. 
Back to Top