వైఎస్ జగన్ దీక్షకు కదిలిరండి..!

హైదరాబాద్: ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పార్టీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనని  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26నుంచి గుంటూరులో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ధర్మాన ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయని ధర్మాన మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై అధికారపార్టీ ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు.  స్పెషల్ స్టేటస్ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని...ప్యాకేజీ హోదాకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని ధర్నాన స్పష్టం చేశారు.
Back to Top