టీడీపీ అంతులేని అవినీతి కథ

కుంభకోణాల ఘనుడిగా బాబు రికార్డ్
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే భారీ అవినీతి
విచ్చలవిడిగా దోపిడీలు..ప్రజాధనం దుర్వినియోగం
అధికార అహంకారం..ప్రతిపక్షంపై కక్షసాధింపు
అక్రమ కేసులు, సస్పెన్షన్ లు, ఎమ్మెల్యేలకు రూ.కోట్ల ఎర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుగలదు ఇందు లేదని, ఎందెందు వెతికినా అవినీతే కనిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అంతులేని అవినీతి వెలుగుచూసింది. లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన ఘనుడిగా బాబు చరిత్ర కెక్కాడు. సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, కాల్ మనీ సెక్స్ రాకెట్ మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్నీ అవినీతి బాగోతాలు. ప్రమాణ స్వీకారం మొదలు ప్రతి కార్యక్రమానికి విచ్చలవిడిగా ప్రజాధ నాన్ని దుర్వినియోగం చేస్తూ...దోపిడీకి పాల్పడిన వైనం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. 

పుష్కరాల్లోరూ. 1600 కోట్ల అవినీతి,  పట్టిసీమలో రూ. 1300 కోట్లు, రాజధాని పేరుతో పేదలు, దళితుల భూములను లాక్కొని  లక్షల కోట్ల అవినీతి, శంకుస్థాపన పేరుతో రూ. 400కోట్లు దోపిడీ, ఇసుక నుంచి మట్టి దాక, బొగ్గులో, జెన్ కో టెండర్లలో, ప్రాజెక్ట్ ల పేరుతో కోటాను కోట్లు దోపిడీ. వీటితో పాటు ఈవెంట్ లు, స్పెషల్ ఫ్లైట్ లు, బస్సులు, ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగ్ లంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్నిదుబారా చేస్తూ చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. 

అధికారంలోకి కొచ్చిన కొద్ది కాలంలోనే టీడీపీ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రజాసమస్యలను గాలికొదిలి..సొంత ప్రయోజనాలు చూసుకుంటున్న చంద్రబాబుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ చంద్రబాబు ఎన్నికలముందు వందలాది వాగ్దానాలు గుప్పించారు. తీరా గద్దెనెక్కాక వాటిని అటకెక్కించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ మోసాలను ప్రజలు గుర్తించారు. అందుకే జన్మభూమి కార్యక్రమాలు, జనచైతన్యయాత్రల పేరుతో వెళ్లిన తెలుగుదేశం నాయకులపై ఎక్కడిక్కడ తిరగబడ్డారు. 

ప్రజల్లో తిరగలేని పరిస్థితి రావడంతో టీడీపీ నేతలు తమ కుట్రలకు పదును పెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి లేక...తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారు. అందులో భాగమే. ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కోవడం,  అక్రమ కేసులు పెట్టడం, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం.

అసెంబ్లీలోనూ, బయట ప్రజల గొంతుక అయిన ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు చంద్రబాబు అండ్ కో కుయుక్తులు పన్నుతోంది. జనహృదయ నేత వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక..చంద్రబాబు అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కోట్లు కుమ్మరించి కొనుక్కుంటున్నాడు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎలుగెత్తిన నేతలను టార్గెట్ చేసి అక్రమ కేేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. సభలో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునేందుకు...స్పీకర్ సహా అధికారపక్షమంతా శ్రమిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టేలా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం, ఎదురుదాడికి దిగడం షరా మామూలైపోయింది. దేశంలో ఏపీ శాసనసభ కౌరవుల సభగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

ఇదే వార్తాశం ఇంగ్లీష్
లో:  http://goo.gl/FZFaAK 

Back to Top