ఏపీలో అవినీతి పాలన రాజ్యమేలుతోంది

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పాలన రాజ్యమేలుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో  ఆయన విశాఖ రైల్వేజోన్ అంశంపై మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై ఉన్న ఆసక్తి విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ పై లేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 లోగా ప్రత్యేక రైల్వే జోన్ పై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని పేర్కొన్నారు.


To read this article in English: http://goo.gl/U4Jc95 
Back to Top