రెండేళ్లలో అవినీతి పరవళ్లు

() చంద్రబాబు పరిపాలనకు రెండేళ్లు

() పరవళ్లు తొక్కుతున్న అవినీతి

() తండ్రీ కొడుకుల దోపిడీతో
అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్

() ప్రజల ద్రష్టిని మరల్చేందుకే
మహా సంకల్పసభ అంటూ హడావుడి

హైదరాబాద్) రెండు సంవత్సరాల
చంద్రబాబు పరిపాలన ను గమనించినట్లయితే మూడు స్కాములు.. ఆరు మాఫియాలతో
వర్థిల్లుతోంది. ఎలాగైనా సరే, డబ్బు సంపాదించాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు అండ్
కో చెలరేగుతోంది. లక్షల కోట్ల రూపాయల ఆర్జనే లక్ష్యంగా అవినీతికి గేట్లు తెరిచారు.
అవినీతిలో తన రికార్డులను తానే తిరగరాస్తున్నారు. ప్రజల మద్దతుతో గెలవడం కన్నా
విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి తిరిగి అధికారంలోకి రావాలనే కుతంత్రంతో పాలన
సాగిస్తున్నారు. చంద్రబాబు ఈ రెండేళ్ల హయాంలో చేసిన అవినీతి ఆయన ముఖ్యమంత్రిగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అవినీతిని మించిపోయింది. ఇప్పటికే
చంద్రబాబు చేసిన అవినీతిని లెక్కలు వేస్తే దాదాపు లక్షన్నర కోట్ల ను దాటుతోందంటే
పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ధన సంపాదన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

        లంచాలు, ముడుపులు, వాటాలు, కమీషన్లు... ఇలా రకరకాల రూపాల్లో
అన్నిచోట్లా బహిరంగంగానే అవినీతి చోటుచేసుకుంటోంది. భూములు, ప్రాజెక్టులు, గనులు, మద్యం, ఇసుక.. ఇలా దేన్నీ వదిలిపెట్టడం
లేదు. ఆఖరికి రాజధాని నిర్మాణంలోనూ తమ స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు.
ఇంత బరితెగించిన అవినీతి, అక్రమాలను
గతంలో తామెప్పుడూ చూడలేదని ప్రభుత్వ సీనియర్‌ అధికారులే విస్తుపోతున్నారు. ఎల్లో
మీడియాలో రాయడానికి వీలు లేకపోవటంతో అనేక మంది సీనియర్ జర్నలిస్టులు సైతం తమ
సహచరులతో ఆవేదనను పంచుకొంటున్నారు. 

అవినీతిలో రాజధానిదే అగ్రస్థానం

రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు
చేస్తున్న భూ దందా ను అంతర్జాతీయ స్థాయి దందా గా అభివర్ణిస్తున్నారు. 29 గ్రామాల
ప్రజల్ని రోడ్డు మీదకు నెట్టేసేందుకు కంకణం కట్టుకొన్న దారుణమైన స్కామ్ ఇది. రైతుల
నుంచి 33వేల ఎకరాల భూముల్ని లాక్కొన్న చంద్రబాబు టీమ్, కేంద్ర ప్రభుత్వం
కన్నుకప్పి 32వేల ఎకరాల అటవీ భూముల్ని నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీంతో
పాటు దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్ బూముల్ని కలపుకొంటే దాదాపు లక్ష ఎకరాల భూముల్ని
లాక్కొంటోంది. తక్కువలో తక్కువ చూసుకొన్న లక్ష కోట్ల రూపాయిల స్కామ్ అని పరిశీలకులు
అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో భూముల్ని విదేశీ బినామీ సంస్థలకు
అప్పగించటం రాజద్రోహంతో సమానమని అభిప్రాయ పడుతున్నారు.

నీటిపారుదల ప్రాజెక్టుల్లో తిష్ట
వేసిన అవినీతి

గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా సుజల స్రవంతి, గోరకల్లు పనులను పాత
కాంట్రాక్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. ఆ పనుల అంచనా వ్యయాన్ని
భారీగా పెంచేశారు. పాలనాపరమైన అనుమతులేవీ తీసుకోకుండానే టెండర్లు పిలిచారు. 25 ప్యాకేజీల్లో టెండర్లు పిలిస్తే
విచిత్రంగా అన్ని పనులు అధికార పార్టీ ఎంపీ సీఎం రమేశ్, ఇతర టీడీపీ నాయకులకే దక్కాయి. ఈ
వ్యవహారంలో రూ.6 వేల
కోట్లు నొక్కేయడానికి రంగం సిద్ధమైపోయింది. దీనిపై సంతకాలు చేయడానికి అప్పటి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రస్తుత సీఎస్‌ టక్కర్‌ ఇరువురూ
మూడుసార్లు తిరస్కరించారు.

అయినా ప్రభుత్వ పెద్దలు వెనక్కి
తగ్గలేదు. ఈ అవినీతి పర్వానికి ‘మంత్రివర్గం ఆమోదం’ పేరిట విజయవంతంగా ఆమోద ముద్ర
వేయించింది. తమకు కావాల్సిన ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు
చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ విధానానికి
స్వస్తి పలికారు. జీవో నం.22ను
తీసుకొచ్చారు. ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లకు రూ.3 వేల కోట్లు అదనంగా చెల్లించారు.
ఈ వ్యవహారంలో రూ.1,500 కోట్ల సొమ్ము చేతులు మారింది.

పట్టిసీమ పేరుతో నిట్టనిలువు
దోపిడీ

ఆంధ్రప్రదేశ్ కు బహుళ ప్రయోజన కారిగా
నిలిచిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం
గొప్పలు చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుని గాలికి వదిలేసింది.
కమీషన్లకు ఆశపడి పట్టిసీమ పథకాన్ని తెర మీదకు తెచ్చింది. ఉన్నపళంగా ఎత్తిపోతల
పథకాన్ని ప్రారంభించింది. 16 వందల కోట్ల రూపాయిల పథకంలో దాదాపు 300 కోట్ల రూపాయిల
మేర కమీషన్లు నొక్కేశారని అర్థం అవుతోంది.



విద్యుత్ ప్రాజెక్టుల నిండా అవినీతి షాకులు

విద్యుత్‌ ప్రాజెక్టులకు గ్యాస్‌పై
వ్యాట్‌ రాయితీ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రెండేళ్లలో రూ. 2,300 కోట్లు నష్టం వాటిల్లుతుందని ఆర్థిక
శాఖ స్పష్టం చేసినప్పటికీ సీఎం చంద్రబాబు లెక్కచేయలేదు. వ్యాట్‌పై రాయితీ ఇస్తూ
నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక బడా కార్పొరేట్‌ సంస్థల నుంచి అందిన ముడుపులే
కారణమని విశ్వసనీయ సమాచారం. ఇక సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్‌కు
అనుమతిస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి పాలనలో
గవర్నర్‌ తాత్కాలికంగా నిలుపుదల చేయగా బాబు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లతో
మరీ సంప్రదింపులు జరిపి ఎస్కలేషన్‌కు ఏకంగా రూ.17,967 కోట్లు చెల్లించేందుకు
అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఎత్తున
కమీషన్లు అందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

లిక్కర్ మాఫియా కు పెద్ద పీట

ఆదాయం కోసం మద్యం అమ్మకాల్ని
చంద్రబాబు ఉరకలు వేయిస్తున్నారు. ప్రజలు ఫుల్లు బాటిల్ తాగాలంటూ స్వయంగా ప్రకటనలు
చేయిస్తున్నారు. బెల్టుషాపులు తగ్గిస్తానన్న హామీ ని పక్కన పెట్టేసి కోట్లు
దండుకొనేందుకు గాను, పెద్ద ఎత్తున బెల్టు షాపుల్ని నడిపిస్తున్నారు. ఇందులో నేరుగా
చంద్రబాబు కుటుంబానికే వాటాలు పోతున్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది.

పారిశ్రామిక రాయితీల్లోనూ
చేతివాటం

చంద్రబాబు తనకు కావాల్సిన వారికి
మేలు చేయడానికి పాత పారిశ్రామిక రాయితీ బకాయిల పేరుతో గత ఆర్థిక సంవత్సరం చివర్లో
ఏకంగా రూ.2,067 కోట్లు విడుదల చేశారు. ఓవర్‌ డ్రాఫ్టులో ఉన్న సమయంలో ఇలా నిధులు
విడుదల చేయడానికి కారణం ప్రభుత్వ పెద్దలకు భారీగా కమీషన్‌ ముట్టడమేనని అధికార
యంత్రాంగం కోడై కూస్తోంది. ఈ మొత్తంలో 30 శాతం వరకు చిన్నబాబుకు ముడుపులు
ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక రాయితీల చెల్లింపులపై నేరుగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ
అవినీతి చెదలు

చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం
ఢిల్లీ  దాకా విస్తరించింది. కేంద్ర మంత్రి
సుజనా చౌదరి దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీ ఏకంగా వివాదాస్పద వ్యాపారులతో సంబంధాలు
పెట్టుకొన్నారు. ఈ ఓఎస్డీ ని చంద్రబాబు కుమారుడు లోకేష్ నియమించినట్లుగా
చెబుతున్నారు. దీంతో ఈ బాగోతం వెనుక చంద్రబాబు కుటుంబసభ్యుల పాత్ర ఉందని స్పష్టం అవుతోంది.




ఇసుక మాఫియా నిండా అవినీతి దందా

రాష్ట్రవ్యాప్తంగా మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా
మారిపోయింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం కోసమే ఇసుక సరఫరా బాధ్యతలను డ్వాక్రా
సంఘాలకు అప్పగించామని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. అయితే డ్వాక్రా సంఘాల ముసుగులో
ఇసుక అక్రమ తవ్వకాలు, అమ్మకాలను
అధికార పార్టీ నేతలే సాగించారు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 75 శాతం, రాయలసీమ జిల్లాల్లో 90 శాతం మేరకు ఇసుకను మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల
అనుచరులే అనధికారికంగా అమ్ముకున్నారు. రూ.కోట్లు జేబుల్లో నింపుకున్నారు. ఇసుక
వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి వాస్తవంగా రావాల్సిన ఆదాయం రూ.4,480 కోట్లు కాగా, వచ్చింది రూ.964 కోట్లు మాత్రమే. అంటే
అక్రమార్కులు మింగేసిన సొమ్ము రూ.3,516 కోట్లు. ఇందులో 75 శాతం.. అంటే రూ.2,637 కోట్లు సీఎం చంద్రబాబు, లోకేశ్‌ల జేబుల్లోకి వెళ్లాయి.

 

తాజా వీడియోలు

Back to Top