అవినీతి కార్పొరేషన్

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : నెల్లూరు నగరపాలకసంస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. స్థానిక ఉడ్‌హౌస్‌సంఘం, శెట్టిగుంటరోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్‌లు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 6వ డివిజన్‌లోని ఎల్‌వీ రమణారెడ్డి లే అవుట్‌లో రూ.3 లక్షలతో నిర్మిస్తున్న మంచినీటి పైప్‌లైన్ పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ...పింఛన్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.  జన్మభూమిలో కొద్దిమందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోకుండా ...కార్పొరేషన్ కార్యాలయంలో పింఛన్ సమస్యలకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఉన్న అర్హులైన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలన్నారు. 

అదేవిధంగా వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన పారిశుద్ధ్య కార్మికులు... అధికారులు, నాయకుల ఇళ్లలో పనులు చేయడం దారుణమన్నారు. 

Back to Top