అవినీతి బాబు.. సీఎంగా అనర్హుడు

  • అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులైనా నిర్వహించాలి
  • రాష్ట్రంలోని పరిస్థితులన్నంటిపై సుదీర్ఘంగా చర్చ జరగాలి
  • సంబంధం లేని విషయాలతో సభను పక్కదారి పట్టించొద్దు
  • ప్రభుత్వ తప్పిదాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజెప్పుతాం
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అవినీతి మచ్చ ఉన్నవ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులకు తగ్గకుండా జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు, వారిలోని అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంతేగానీ సమావేశాలను రెండు మూడు రోజులు  తూతూమంత్రంగా జరిపి తప్పించుకోవాలని చూడడం సరికాదని ముందస్తుగా హెచ్చరించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. 

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
()తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు డబ్బులు ఇస్తూ దొరికిపోయిన చంద్రబాబు...తప్పు చేయలేదు అని గుండెమీద చేయివేసుకొని చెప్పగలడా. ఆవాయిస్ నాది కాదని చెప్పలేకున్నాడంటే తప్పు చేసినట్లు కాదా..?
()తప్పు చేసి కూడా పదవుల్లో కొనసాగడం ఎంత అనైతికమో తనకు తాను ఆలోచన చేసుకోవాలి.
() రాబోవు సమావేశాలను 10 నుంచి 15 రోజులు తగ్గకుండా జరపాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఒకరోజు, రెండురోజులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వేదిక కాబట్టి వారి అనుమానాలు నివత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎవరినో అడ్డుపెట్టుకొని సభను తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నం చేయొద్దు. 
()అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిపి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేవిుధంగా ప్రభుత్వం వ్యవహరించాలి.

ప్రజాసమస్యలు, ప్రభుత్వ అవినీతిపై చర్చ జరగాలి
()రాష్ట్రంలోని కరువు కాటకాలు, వ్యవసాయ పరిస్థితి, అందని రుణాలు, ప్రత్యేకహోదా, విభజన హామీలు, పోలవరం, స్విస్ ఛాలెంజ్, విద్యుత్ కుంభకోణం, సంక్షేమ హాస్టళ్లు మూసేస్తున్నారు. ఆగిపోయిన గృహనిర్మాణం, దేవాలయాల ధ్వంసం. సదావర్తి భూముల్లో అవినీతి. బాక్సైట్ మైనింగ్, పాఠశాలల మూసివేత, అధిక ఫీజులు, కరార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ. ఆర్టీసీ స్థలాల లీజు వీటన్నంటిపై సుదీర్ఘ చర్చ జరగాలి.
()మంజునాథ కమిషన్ మార్గదర్శకాలు పాటించడం లేదు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం 29 మంది ప్రాణాలను బలిగొన్నారు. దానిపై  మంజునాథ కమిషన్ విచారణ ఎంతవరకు వచ్చిందో అసెంబ్లీలో చర్చ జరగాలి. అదేవిధంగా కృష్ణా పుష్కరాల అవినీతిపైనా, అవినీతిలో ఏపీ నంబర్ వన్ ర్యాంకు పైనా, మహిళా వేధింపులపై(ఏపీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు),ఏపీకి ఫర్ ఫెమెన్స్ లో 30వ స్థానంపై చర్చ జరగాలి. 15 శాతం గ్రోత్ రేట్  ఏవిధంగా వచ్చిందో ప్రభుత్వం నిరూపించాలి. 
()ఈపాస్ విధానంతో రైతులు పడుతున్న ఇబ్బందులు, నీటి ప్రాజెక్ట్ ల అంచనాల పెంపు పేరుతో అవినీతి. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీల పెంపు. అమరావతి, సల్మాన్ పేటలో దాడులు. పుష్కరాల్లో రూ.3500 కోట్ల అవినీతిపైనా చర్చ జరగాలి. స్పీకర్ కుమారుడు, యరపతేనిని దందాలు, కాల్వ శ్రీనివాసులు, మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ మైనింగ్ దందాలు, మంత్రి రావెల కిశోర్ కుమారుడు లేడీస్ హాస్టళ్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన దానిపైనా, గాంధీవిగ్రహాల తొలగింపు, శివపీఠాధిపతి భూములను దోచుకోవడంపైనా చర్చ జరగాలి.

సభను పక్కదారి పట్టించి తప్పించుకోవాలని చూడొద్దు
ఎన్నికల హామీలు, కేబుల్ కబ్జా, ఎన్నికల్లో 11కోట్లు ఖర్చుపెట్టానన్న స్పీకర్ వ్యాఖ్యలపై, నయీం కేసులో అచ్చెన్నాయుడు పాత్ర, అవినీతిపై నట్టికుమార్ చేసిన ఆరోపణలపైనా అసెంబ్లీలో చర్చ జరగాలి. అన్ ఎంప్లాయింట్ మెంట్, ఉద్యోగుల సమస్యలు వీటన్నంటిపై చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీటిలో ఏవి ముఖ్యం కాదో వాళ్లు ప్రశ్నించుకోవాలి.  ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడం అన్నీ బాగానే ఉన్నాయంటూ వాళ్లంతట వాళ్లే పొగిడేసుకునే విధానం మానుకోవాలి.  కరువుతో రాష్ట్రం అల్లాడుతోంది. రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరగాలి.  సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి సభను డైవర్ట్ చేయొద్దు. ఎదురుదాడి చేసి తప్పించుకోవాలని చూడొద్దు. సంవత్సరంలో ఎప్పుడో ఓ సారి స్టేట్ మెంట్ ఇస్తారు. కానీ  ప్రతీ రోజు స్టేట్ మెంట్ తీసుకొచ్చి తప్పించుకోవాలని చూడడం ప్రభుత్వానికి తగదు. 

పబ్లిసిటీ పిచ్చి తప్ప బాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టడం లేదు
రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేందుకు బాబు రెయిన్ గన్ ల పేరుతో కరువును జయించానని పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. 5ఎంఎం కూడా తడపకుండా కరువును జయించానంటాడు. కరువుతో ఆడుకోవడం, ప్రతీది ఈవెంట్ మేనేజ్ మెంట్ లు చేయడం. ఏరియల్ సర్వేలు చేయడమేంటి బాబు...? రెయిన్ గన్ ల పేరుతో అవినీతి చేస్తున్నారు. 5 శాతమైనా వేరుశనగలో దిగుబడి వచ్చిందా...? ఎంతసేపు మీకు పబ్లిసిటీ స్టంట్ తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవా..? తాము లెవనత్తిన అంశాల్లో మీ వ్యూహమేంటో బయటపెట్టండిరెండురోజుల ముందే ప్రస్తావిస్తున్నాం. దేనిపై చర్చిస్తారో ముందే చెప్పండి. అంతేగానీ అణగదొక్కేవిధంగా ప్రయత్నాలు చేయడం కాదు. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరో సాధించిన దాన్ని కూడా మేమే చేశామని చెప్పుకోవడం తగదు. ఓటుకు కోట్లు కేసులో తప్పు చేసినట్లు బాబు ఒప్పుకుంటున్నందునే విచారణను ఎదుర్కోవడం లేదు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజెప్పేందుకు వైయస్సార్సీపీ ప్రయత్నిస్తుందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top