సొంత గూటికి క‌డ‌ప కార్పొరేట‌ర్లు

వైయ‌స్ఆర్ జిల్లా:  తెలుగు దేశం పార్టీ ప్ర‌లోభాల‌కు గురై అధికార పార్టీలో చేరిన క‌డ‌ప కార్పొరేష‌న్ కార్పొరేట‌ర్లు మ‌ళ్లీ సొంత గూటికి చేరారు. గతంలో వైయ‌స్ఆర్ సీపీని వీడిన ఆరుగురు కడప కార్పొరేటర్లు గురువారం పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమ్మిత్తం ఇడుపుల‌పాయకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌డ‌ప కార్పొరేటర్లు క‌లిశారు. దీంతో వారికి వైయ‌స్ జ‌గ‌న్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ తరఫున గెలిచిన ఈ ఆరుగురు కార్పొరేటర్లు గతంలో టీడీపీలో చేరారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్ సురేష్‌ బాబు పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

Back to Top