సస్పెన్షన్ ను నిరసిస్తూ కార్పొరేటర్స్ ఆందోళన

విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. కృష్ణా పుష్కర పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని వైయస్ఆర్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అందుకు అధ్యక్ష స్థానంలో ఉన్న మేయర్ కోనేరు శ్రీధర్ ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు... మేయర్ పోడియం వద్ద బైఠాయించారు.

మేయర్ కోనేరు శ్రీధర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేయర్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, ఆగ్రహించిన మేయర్ వైయస్సార్సీపీ కొర్పొరేటర్లను సస్పెండ్ చేశారు. మేయర్ తీరును నిరసిస్తూ కౌన్సిల్ హాల్లోనే వైయస్ఆర్ సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Back to Top