ఆత్మీయ ప‌ర్య‌ట‌న‌

విశాఖ‌ప‌ట్నం)) ప్రతిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఆద్యంతం ఆత్మీయంగా సాగింది. బాధితుల కుటుంబాల్ని ప‌ల‌క‌రించి ధైర్యం చెప్పి స్వాంత‌న చేకూర్చారు.

బంగాళాఖాతంలో గ‌ల్లంతైన విమానంలో ప్ర‌యాణించిన ఉద్యోగుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. కుటుంబ పెద్ద తిరిగి వ‌స్తాడో, తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయాడో తెలియ‌న ప‌రిస్థితిలో జీవిస్తున్నారు. ఇంత‌టి ఆందోళ‌న చెందుతున్న కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించేందుకు ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ విశాఖ కు విచ్చేశారు.


అక్క‌డ మొద‌ట‌గా 104 ఏరియాలో భూపేంద్ర‌సింగ్ ఇంటికి చేరుకొన్నారు. బుచ్చిరాజుపాలెంలో ఎన్‌. చిన్నారావు ఇంటికి , గోపాల‌ప‌ట్నం లో పి. నాగేంద్ర‌రావు ఇంటికి వెళ్లారు. కుటుంబ పెద్ద క‌నిపించ‌కుండా పోతే ఏర్ప‌డే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు త‌నకు బాగా తెలుస‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. క‌ల‌త చెంద‌కుండా ధైర్యంగా ఉండాల‌ని స్వాంత‌న ప‌లికారు. అనంత‌రం వేప‌గుంట లో జి శ్రీనివాస‌రావు కుటుంబాన్ని, అప్ప‌న్నపాలెంలో బీ సాంబ‌మూర్తి కుటుంబాన్ని, మాధ‌వ‌ధార లో ఆర్వీ ప్ర‌సాద్ రావు కుటుంబ‌స‌భ్యుల్ని ప‌ల‌కరించారు. ఇటువంటి క్లిష్ట స‌మ‌యంలో ధైర్యం వ‌హించాల‌ని పేర్కొన్నారు.


జ‌న నేత వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఆయా కాల‌నీల్లో వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని తెలుసుకొని విప‌రీతంగా జ‌నం విచ్చేశారు. వైయ‌స్ జ‌గన్ ను క‌లిసేందుకు పోటీ ప‌డ్డారు. 
Back to Top