విశాఖ జిల్లాలో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల నియామ‌కం

హైద‌రాబాద్‌) విశాఖప‌ట్నం జిల్లాలో వైయ‌స్సార్సీపీ పార్టీ బాధ్యుల నియామ‌కం జ‌రిగింది. ఎల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా బొడ్డేడ ప్ర‌సాద్ ను నియ‌మించారు. పాయ‌క‌రావు పేట నియోజ‌క వ‌ర్గానికి న‌లుగురు స‌భ్యుల‌తో సమ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే చంగ‌ల వెంక‌ట్రావు, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, వీసం రామ‌కృష్ణ ల‌ను క‌మిటీలో స‌భ్యులుగా నియ‌మించారు. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నియామ‌కాలు జ‌రిగిన‌ట్లు పార్టీ కేంద్ర కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. 
Back to Top