నోరు అదుపులో పెట్టుకోండి....టిడిపి నేతలకు వైయస్ ఆర్ సీపీ హెచ్చరిక

తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదని, నోరు
అదుపులో పెట్టుకోవాలని టిడిపి నేత బుద్దా వెంకన్నను వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార
ప్రతినిధి టిజెఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. ఎమ్మెల్యే రోజాపై వెంకన్న చేసిన
వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన పత్రికా సమావేశంలో
మాట్లాడారు. రాష్ట్రంలో
జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు దుష్ట​ పరిపాలనలో మహిళలు, చిన్నారులు
నలిగిపోతున్నారని అన్నారు. ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు
విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. విదేశీ మహిళలతో లోకేశ్‌ అసభ్య ఫొటోలు
ఉన్నాయని, ఇంట్లో
పనివాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు.
దేనిపైనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు.

సిపిఐ రామకృష్ణ ఆ
వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై
సిపిఐ నాయకులు రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుధాకర్ బాబు డిమాండ్
చేశారు. వామ పక్ష పార్టీలంటే తమకు గౌరవముందని, వామ పక్ష భావజాలంతో సారూప్యంగా అనేక
పథకాలను ప్రకటించామని అయితే, కేవలం రామకృష్ణ మాత్రం సిపిఐ అంటే చంద్రబాబు పార్టీ
ఆఫ్ ఇండియాగా పరిగణిస్తున్నట్లుగా ఉందన్నారు. బిజెపితో వైయస్ ఆర్ కాంగ్రెస్ కు లింకులు
పెట్టే గ్లోబెల్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన సూచించారు.

Back to Top