ఇసుక మాఫియాను అరికట్టండి

విజయవాడ: జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను కలెక్టర్‌ను కోరారు.  నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావుతో కలిసి మచిలీపట్నం వచ్చిన ఆయన కలెక్టర్ బాబును కలిశారు. ఆయనకు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడారు. వత్సవాయి మండలం ఆలూరుపాడు ఇసుక రీచ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియాతో కుమ్మకై రోజుకు రూ.5 లక్షల విలువైన ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కేటాయించిన ఇసుక రీచ్‌లలో మహిళలు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే వ్యాపారాలు చేస్తున్నారని ఆయన వివరించారు.
Back to Top