అండ‌గా ఉంటా- ప్ర‌తిప‌క్ష నేత‌ను కలిసిన విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 
- రాజ‌న్న బిడ్డ‌కు త‌మ బాధ‌లు చెప్పుకున్న ట‌మాట రైతులు

చిత్తూరు:  చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. నష్టపోయిన వారికి భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. అంద‌రికీ అండ‌గా ఉంటాన‌ని జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిత్తూరు జిల్లా మూల‌ప‌ల్లి క్రాస్ నుంచి 48వ రోజు పాద‌యాత్రను వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా దారిపొడువునా వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వైయ‌స్ జ‌గ‌న్‌కు క‌లిసి త‌మ స‌మ‌స్య‌లుచెప్ప‌కున్నారు.తమను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ట‌మాట రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌కు క‌లిసి బాధ‌లు వెల్ల‌బోసుకున్నారు. 35 కేజీల ట‌మాట‌ల‌ను వంద రూపాయ‌ల‌కు కొనే నాథుడు లేడ‌న్నా..అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారి స‌మ‌స్య‌లు ఓపిక‌గా విన్న వైయ‌స్ జ‌గ‌న్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మీరు  సూచించిన అంశాలే మ్యానిఫెస్టోగా తయారు చేసి వాటిని పూర్తి చేసి 2024లో మళ్లీ తమ ముందుకు వస్తానని వైయ‌స్ జగన్ చెప్పారు.  
Back to Top