ఏపీ భవన్‌లో కొనసాగుతున్న ఎంపీల దీక్ష


ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సాయంత్రం ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల దీక్షాస్థలి వద్ద ఈదురు గాలులు చెలరేగడంతో ఏపీ భవన్‌లో ఎంపీలు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా దీక్షాస్థలి శిబిరం కూలిపోయింది. అయినా సరే ఎంపీలు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఎంపీల దీక్షకు పలు ప్రజా సంఘాలు, విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. అలాగే వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులు మద్దతుగా నిలిచారు.వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిజాయితీగా పోరాడుతున్నారని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
 
Back to Top