హోదాపై చర్చకు మొక్కవోని పోరాటం

()హోదా అంశంపై దద్దరిల్లిన అసెంబ్లీ
()చర్చకు పట్టుబట్టిన వైయస్సార్సీపీ
()హోదాను డైవర్ట్ చేసేందుకు టీడీపీ కుట్రలు
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ దౌర్జన్యం
()ఎమ్మెల్యేలతో వైయస్ జగన్ భేటీ
()తదుపరి వ్యూహంపై చర్చ

హైదరాబాద్ః  రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైయస్సార్సీపీ అసెంబ్లీలో అలుపెరగకుండా పోరాడుతోంది.  పట్టువదలని విక్రమార్కుల్లా ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతున్నారు.  హోదాను డైవర్ట్ చేసేందుకు బాబు డైరక్షన్ లో స్పీకర్, టీడీపీ సభ్యులు కుట్రలకు తెరలేపారు. ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టే ధోరణికి తెరలేపారు. తమపై దాడులు చేస్తున్నారనే అబద్ధపు ప్రచారాన్ని అందుకున్నారు. టీడీపీ ఎన్ని విషప్రచారాలు చేసినా ప్రత్యేకహోదా నుంచి తప్పించుకోలేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో స్పీకర్ పోడియంను చుట్టిముట్టి నిరసన తెలిపారు. ఐతే, శాంతియుతంగా సభలో హోదా కోసం నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై మార్షల్స్ ను ఉసిగొల్పి వారితో దాడులు చేయించే స్థాయికి చంద్రబాబు దిగజారారు. మార్షల్స్ దౌర్జన్యంపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

రాష్ట్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వీటన్నంటిపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సి ఉంది. ప్రజాసమస్యలపై చర్చ జరిగితే తమ డొల్లతనం బయటపడుతుందని చంద్రబాబు సర్కార్ తూతూమంత్రంగా మూడు రోజుల సమావేశాలను ముగించేందుకు సిద్ధమైంది. వైయస్సార్సీపీ ప్రధానంగా 43 అంశాలపై అసెంబ్లీలో చర్చజరగాలని తీర్మానం ఇవ్వగా...అధికార టీడీపీ ఒప్పుకోలేదు. తమకు వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు అవసరం లేదన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది. ప్రత్యేకహోదా, కరువు, పుష్కరాల్లో అవినీతి, ఓటుకు కోట్లు కేసు సహా అనేక అంశాలపై ప్రజల ఆకాంక్షను వైయస్సార్సీపీ ప్రతిబింబిస్తుండడంతో అధికారపార్టీ వణికిపోతోంది. 

మరోవైపు, ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ తన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన తదుపరి వ్యూహంపై ముమ్మరంగా చర్చిస్తున్నారు. కాగా, రెండో రోజు అసెంబ్లీ ప్రత్యేకహోదా అంశంపై దద్దరిల్లింది. ప్రత్యేకహోదాపై చర్చకు అధికార టీడీపీ భయపడుతోంది.

Back to Top