జగన్‌ దృష్టికి నియోజకవర్గ సమస్యలు

పార్వతీపురం టౌన్‌: నియోజకవర్గం సమస్యలను వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి పార్వతీపురం నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ తీసుకెళ్లారు. విశాఖలో గురువారం జరిగిన మహా ధర్నాకు హాజరైన జగన్‌ను ఆయన కలిసి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బూత్‌ స్థాయి కమిటీల ఏర్పాటు, ప్లీనరీల నిర్వహణ, బోడి కొండ, బడేదేవర కొండల పోరాటాలు తదితర అంశాలను వివరించారు. నియోజగవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, జన్మభూమి కమిటీల అరాచకాలు, రైతులకు విత్తనాల సరఫరాలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాజెక్టులు పూర్తయినా కాలువలు పూర్తికాక సాగునీటికి నోచని రైతులు, అవుట్‌సోర్సింగ్, అంగన్‌వాడీ పోస్టుల నియామకాల కోసం జరుగుతున్న బేరసారాలు, భూ కబ్జాలు, అనధికార భవన నిర్మాణాలపై పాలకులు చర్యలు తీసుకోకపోవడం, పురపాలక సంఘం పరిధిలో బురదనీటి సరఫరాపై చర్చించారు. ప్రజల పక్షాన పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రభుత్వ దోపిడిని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించినట్టు ప్రసన్నకుమార్‌ తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top