చ‌నిపోయిన కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ‌

అచ్చంపేట:  ఇటీవ‌ల మృతి చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కావ‌టి శివ‌నాగ మ‌నోహ‌ర నాయుడు ప‌రామ‌ర్శించారు. మండ‌ల ప‌రిధిలోని గ్రంధ‌శిరి గ్రామానికి చెందిన కిలారి దుర్గాప్ర‌సాద్‌, చిగురుపాడు గ్రామానికి చెందిన ప్ర‌ముఖ రంగ‌స్థ‌ల క‌ళాకారుడు రాయ‌ల రామారావులు ఇటీవ‌ల అనారోగ్యంతో మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న మ‌నోహ‌ర నాయుడు ఆ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. ఆయన వెంట మండల పార్టీ కార్యదర్శి కోటపాటి వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టరు అంబటి నారాయణ, జిల్లా పార్టీ సభ్యుడు సుంకర శ్రీనివాసరెడ్డి, క్రోసూరు ఎంపీటీసీ అనుముల శ్రీనివాసరెడ్డి, జిల్లా బిసీ నాయకులు మేకల హనుమంతరావు, మాజీ ఎంపీపీ తడవర్తి నాగేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top