టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలవి డ్రామాలు

 • ప్రత్యేకహోదాపై ఆ మూడు పార్టీలకు చిత్తశుద్ధి లేదు
 • బిల్లు పాస్ కాకుండా కుట్ర పన్నాయి
 • కావాలనే సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించాయి
 • ప్రత్యేకహోదా సాధనే వైయస్సార్సీపీ ధ్యేయం
 • వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీః ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రైవేటు మెంబర్ బిల్లు పాస్ కానీవొద్దన్న దురుద్దేశ్యంతోనే మూడు పార్టీలు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించాయని విమర్శించారు. ప్రత్యేకహోదాపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే...


 • బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ మూడు పార్టీలు కుమ్మక్కై హోదాపై డ్రామాలు ఆడుతున్నాయి.
 • బిల్లు పాస్ కానీవొద్దన్న దురుద్దేశ్యంతో బిల్లును అడ్డుకోవడానికి సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారు. 
 • బిల్లును ప్రవేశపెట్టిన సభ్యుడే పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేసి సభా కార్యక్రమాలను అడ్డుకోవడం దురదృష్టకరం.
 • బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ కార్యక్రమాలకు ఎందుకు ఆటంకం కలిగిస్తోంది. 
 • సమస్య పరిష్కారం గాకుండా వాటిని పొడిగించి ఏదో చేశామని చెప్పుకోవాలన్న తపన తప్ప హోదా తీసుకురావాలన్న సదుద్దేశ్యం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు లేవు.  
 • అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హోదా ప్రకటన చేశారు. 
 • ఏపీకి చట్టబద్ధంగా హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. 
 • ఏ పార్టీ, వ్యక్తి అయినా హోదా కోసం  తెచ్చిన బిల్లును వైయస్సార్సీపీ బలపరుస్తోంది. 
 • ప్రైవేటు బిల్లు అసవసరం లేనప్పటికీ వైయస్సార్సీపీ సమర్థిస్తుంటే బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ మాత్రం డ్రామాలు ఆడడం అసహ్యంగా కనిపిస్తోంది.
 • గత రెండేళ్లుగా  ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్. 
 • కాంగ్రెస్ , టీడీపీ లాగా తాము నాటకాలు ఆడడం లేదు. 
 • చిత్తశుద్ధితో హోదా సాధించాలన్న ధ్యేయంతో పోరాడుతున్నాం. ఇకముందూ పోరాటం కొనసాగిస్తాం. అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్లి హోదాను సాధించుకుంటాం. ప్రజల్లోకి వెళతాం.Back to Top