ప్రజల మనోభావాలంటే కాంగ్రెస్‌కు లెక్కలేదు

కడప, 17 ఆగస్టు 2013:

ప్రజల మనోభావాలంటే లెక్ లేకుండా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అందరికీ సమన్యాయం చేయాలంటూ ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనా‌థ్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. వారి శరీరంలోని బి.పి., ‌చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని వైద్యులు తెలిపారు.

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి‌ సహా పెద్ద ఎత్తున ప్రజలు శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌ల దీక్షా శిబిరానికి తరలి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. వారి దీక్షలకు  ఈసీ గంగిరెడ్డి మద్దతు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి జమ్మలమడుగు వెంకటేశ్వర దేవాలయంలో 101 కొబ్బరి కాయలు కొట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, జేఏసీ నేతలు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top