రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్‌ పార్టీ రాక్షస క్రీడ

హైదరాబాద్ :‌

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే కుట్రలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలతో రాక్షస క్రీడ ఆడుతోందని పార్టీ నాయకుడు‌, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదని ఆయన అన్నారు. ఈ దేశాన్ని తమ కుటుంబం మాత్రమే పరిపాలించాలన్న సోనియాగాంధీ స్వార్థమే ఈ దుస్థితికి కారణమని మేకపాటి విమర్శించారు. రాష్ట్ర విభజనపై సోనియా నిర్ణయాన్ని దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు.

ఆంధ్ర రాష్ట్ర విభజన నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు పెరిగాయని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు తాము తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి విశేష ప్రజాదరణ ఉందని ‌మేకపాటి చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top