కాంగ్రెస్‌ పార్టీకి మైండ్‌ బ్లాక్ అయింది: ప్రసన్న

కోవూరు (నెల్లూరు జిల్లా) :

నాలుగు రాష్ట్రాల ప్రజలిచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ మైం‌డ్‌ బ్లాక్ అయిందని, ఇక ఆ పార్టీ పని అయిపోయినట్టు అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారన్నారు. 2014లో ఎన్నికల అనంతరం సోనియాగాంధీ ఇటలీకి మకాం మార్చాల్సిందేనని ప్రసన్న జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్రానికి‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మకుటంలేని మహారాజుగా 30 ఏళ్ల పాటు సీఎంగా ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేస్తారన్న ధీమాను ప్రసన్న వ్యక్తం చేశారు.

ఏ సమస్య వచ్చినా తానున్నాననే భరోసా ఇస్తూ అన్ని వర్గాల వారికి అండగా ఉండి శ్రీ జగన్ ఆదుకుంటారని ‌ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో 175 అసెంబ్లీ , 25 పార్లమెంటు స్థానాలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. ఢిల్లీలో శ్రీ జగన్ చక్రం తిప్పడం ఖాయమన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top