వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌ల వెల్లువ‌


 

విశాఖపట్నం :  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ పార్టీల నాయ‌కులు ఆక‌ర్శితుల‌వుతున్నారు. ఇటీవ‌ల వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి నియోజకవర్గ కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో  వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.  వైయ‌స్ జగ న్‌మోహన్‌రెడ్డి  వ‌ద్ద‌కు రామచంద్రరావు, బలరామ్మూర్తిని తీసుకుని వెళ్లి ఉమాశంకర్‌ పరిచయం  చేశారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.

100 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు...
 కాంగ్రెస్‌కు చెందిన 100 మంది కార్యకర్తలు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రుత్తల వెంకటేశ్వరరావు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాచపల్లి పంచాయతీ పరిధిలోని యరకన్నపాలెం, ధర్మవరం, కొత్తపాలెం గ్రామాలకు చెందిన 100 మంది తన అనుచరులతో కలసి ఆదివారం మండలంలోని చంద్రయ్యపాలెం మీదుగా సాగిన సంకల్పయాత్రలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. నర్సీపట్నం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌ గణేష్, పార్టీ నేత రుత్తల యర్రాపాత్రుడు సమక్షంలో జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రుత్తల సత్యనారాయణ, ఆర్‌.వి.ఎస్‌.ప్రసాద్, అడిగర్ల కృష్ణ, గండి పైడన్న, సత్తిబాబు తదితరులు ఉన్నారు. 


Back to Top