వైయస్సార్సీపీలో కాంగ్రెస్ నాయకుల చేరిక

హైదరాబాద్ః గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి వైయస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కత్తెర సురేష్ కుమార్, హెనీ క్రిస్టినా ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,  కార్యకర్తలు వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ వైయస్ జగన్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అందరినీ మనస్ఫూర్తిగా వైయస్సార్ కుటుంబంలోకి స్వాగతం పలికారు.

Back to Top