వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు

అనంతపురంః  జిల్లాలోని  సోమందేపల్లిలో మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి.కె ప్రకాష్ తో పాటు పెద్ద ఎత్తున నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంపై ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకాష్ , ఇతర నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు భాస్కర్ రెడ్డి, గుట్టూరు శ్రీరాములు, రామ్మోహన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Back to Top