వైయ‌స్ఆర్‌సీపీలోకి ఊపందుకున్న వ‌ల‌స‌లు

-  వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో ప్ర‌కాశం జిల్లా లింగారెడ్డి  చేరిక‌
- తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి 50 మంది నాయ‌కులు చేరిక‌
 ప‌శ్చిమ గోదావ‌రి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రతో ప్రజల్లో వస్తోన్న అనూహ్య స్పందన చూసి రాజకీయ పార్టీల నేతలు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్లలో పాదయాత్ర చేస్తోన్న వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడుకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు లింగారెడ్డి మధుసూధనరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా మహీధర్‌రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్‌లో కీలకనేతగా ఎదిగిన మధుసూధనరెడ్డి  వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా జీవించాలంటే వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని  ఆయన ఆకాంక్షించారు.  

తూర్పు గోదావ‌రి జిల్లా నాయ‌కుల చేరిక‌
 వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పి.గన్నవరం  నాయకులు కొండేటి చిట్టబ్బాయి, సీఏసీ సభ్యులు కుడిపూడి చిట్టబ్బాయి, మిదిగుండి మోహన్‌ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు పార్టీలో చేరారు. వారిలో వార లక్ష్మీనరసింహం, మాజీ ఎంపీటీసీ బొక్క ఏడుకొండలు, బొబ్బిలి దుర్గారావు, దామిశెట్టి అంజిబాబు, మాజీ సర్పంచ్‌ కడలి రామకృష్ణ, మట్టపర్తి నవీన్‌ తదితరులు ఉన్నారు.  


తాజా వీడియోలు

Back to Top