కాంగ్రెస్‌ అధిష్టానం డైరెక్షన్‌లోనే కిరణ్ వీరావేశం

విశాఖపట్నం, 28 సెప్టెంబర్ 2013:

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. సిఎం కిరణ్కు సమైక్య రాష్ట్రంపై నిజంగా చిత్తశు‌ద్ధే ఉంటే అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ‌శుక్రవారంనాడు కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో చూపిన వీరావేశం అంతా కేంద్రం డైరెక్షన్‌లోనే జరిగిందని ఆరోపించారు.
సమైక్యాంధ్రప్రదేశ్‌ ఉండాలని తాను నిజాయితీగా ఉన్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి ఎం.పి.ల రాజీనామాలను ఎందుకు అడ్డుకుంటున్నారని దాడి సూటిగా ప్రశ్నించారు. సమైక్య ఉద్యమానికి వెన్నుపోటు పొడవడంలో భాగంగానే సిఎం కిరణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారని దాడి వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top