ద్విపాత్రాభినయంతో కాంగ్రెస్ మోసం

హైదరాబాద్ 06 జూలై 2013:

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీలో డిప్యుటీ ఫ్లోర్ లీడర్ మేకతోటి సుచరిత తెలిపారు. ఈ మేరకు వారొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే అనేక పర్యాయాలు చర్చించామనీ, ఇక నిర్ణయమే మిగిలిదందనీ దిగ్విజయ్ సింగ్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎక్కడ చర్చించారు.. ఎవరు పాల్గొన్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదనీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం రకరకాలుగా మాట్లాడుతోందనీ తెలిపారు. స్పష్టమైన ప్రతిపాదన పెట్టి.. చర్చలు ప్రారంభించాలి కదా! ఆ తుపరే ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కారాలు అన్వేషించడం మొదలుపెట్టాలి. ఇవేవీ చేయకుండానే చర్చించేశాం.. నిర్ణయమే తరువాయంటూ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు చెప్పడం ఎంతవరకూ సమంజసమన్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదనీ, ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమనీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ద్విపాత్రాభినయంతో ప్రజలను మోగిస్తున్నారన్నారు. ఇలాంటి మోసపూరిత విధానాలకు స్వస్తి పలకాలని బాలినేని, సుచరిత కోరారు.

తాజా వీడియోలు

Back to Top