<br/><br/>కర్నూలు: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 30 మంది కీలక నేతలు సోమవారం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ నాయకుడు కోటగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైయస్ జగన్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ..చంద్రబాబు ఈ నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మిత్రపక్షమైన బీజేపీని పాలక పక్షం కలుపుకుపోవడం లేదని మండిపడ్డారు. ప్రజలకు రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని భావించి తాము వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నామని తెలిపారు. వైయస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని టీడీపీ నేతలు నిర్వీ్ర్య పరుస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.