ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

నెల్లూరుః (శ్రీహరికోట) అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ38 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది.ఈ సందర్భంగా వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఇస్రో ప్రయోగం సక్సెస్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మరెన్నో ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. 

ఈ ఉదయం 9.29 గంటలకు నిప్పులు చిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ సీ38 రాకెట్ అంతరిక్షంలోకి పయనమైంది. మొత్తం 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకుపోయింది. ఇందులో రెండు మనదేశానికి చెందినవి. వీటిలో 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌–2ఈ ఉపగ్రహంతోపాటు దేశీయ యూనివర్సిటీకి చెందిన ఒక చిన్న ఉపగ్రహం ఉంది. 

ఇవికాకుండా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు ఉన్నాయి.పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం కాగా, ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్ల ప్రయోగంలో 17వ ప్రయోగం కావడం విశేషం. దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్‌ సిరీస్‌ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్‌ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు.


Back to Top