హైదరాబాద్) జాతీయ ఉత్తమ చలనచిత్రంగా బాహుబలి ఎంపిక కావటం పట్ల ప్రతిపక్ష నేత, వైెఎస్సార్సీపీ అధ్యక్షుడు వైెఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. సినిమా యూనిట్ కు అభినందనలు తెలిపారు. అరుదైన గౌరవం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించే మరిన్ని అద్భుత చిత్రాలు మన తెలుగు సినీ పరిశ్రమలో రూపుదిద్దుకోవాలని వైెఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.