గెలుపు మాదే సుమా..కాకాణి

నెల్లూరు: రాజ్యసభ ఎన్నికకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా...తమ
పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయం ఖాయమని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా
అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని స్పష్టం
చేశారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరాచకపాలన సాగిస్తున్నారన్నారు. టీడీపీ మహానాడులో
ప్రతిపక్ష వైస్సార్‑సీపీని విమర్శించడం తప్ప చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు.
వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారో చెప్పలేదన్నారు.
బాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని మేకపాటి
చెప్పారు.

 

 

Back to Top