బాధిత కుటుంబాలకు సంతాపం

హైదరాబాద్: కోల్ కతా లో ఫ్లై ఓవర్ కుప్ప కూలిన ఘటన మీద ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు సోషల్ వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు.

      కోల్ కతా ఫ్లై ఓవర్ కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియచేశారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కోల్ కతా లోని ఠాగూర్ కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కుప్పకూలిన ఘటనలో 21 మంది మరణించగా... 88 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నారు. వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఈ ఘటనలో గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.


To read this article in English: http://goo.gl/4Lv64y

Back to Top