న‌టుడు గిరిబాబుకి సంతాపం

హైదరాబాద్: ప‌్ర‌ముఖ సినీ నటుడు గిరిబాబు కి ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం తెలిపారు. ఆయ‌న భార్య శ్రీదేవి అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఆమె మ‌ర‌ణానికి వైఎస్ జగన్ సంతాపాన్ని తెలిపారు. ప్రకాశం జిల్లా రావినూతలలోని స్వగృహంలో ఉన్న గిరిబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె బుధవారం అర్థరాత్రి మ‌ర‌ణించారు. దీంతో అంత్య‌క్రియ‌ల నిమిత్తం ఆయ‌న కుటుంబం స్వ‌గ్రామం రావినూత‌ల కు చేరుకొన్నారు.

To read this article in English: http://bit.ly/23MjFBq

Back to Top