మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు

హైద‌రాబాద్‌: ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఇటీవ‌ల ఆక్సిజ‌న్ అంద‌క మృతి చెందిన కృష్ణనాయక్ ఘ‌ట‌న‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయ‌కులు మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమ‌వారం వారు హ‌క్కుల క‌మిష‌న‌ర్‌కు లేఖ అంద‌జేసి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ నెల 12న కృష్ణ‌నాయ‌క్ అస్త‌మాతో బాధ‌ప‌డుతూ ఎర్ర‌గ‌డ్డ ప్ర‌భుత్వ ఛాతి ఆసుప‌త్రికి వెళ్ల‌గా ఆక్సిజ‌న్ పెట్టేందుకు అటెండ‌ర్ రూ.150 లంచం అడిగారు. త‌న వ‌ద్ద డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఊపిరి ఆడ‌గ‌క కృష్ణ‌నాయ‌క్ మృతి చెందిన విష‌యంపై వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు స్పందించారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి ఇలాంటివి పున‌రావృతం కాకుండ చ‌ర‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ  తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్ కోరారు. 

Back to Top