సోమిరెడ్డి అవినీతిపై ఈడీకి ఫిర్యాదు

  • చంద్రమోహన్ రెడ్డి అవినీతి జిల్లాలో కొండెక్కింది
  • హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు తరలించాడు
  • అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక కుంభకోణాలకు పాల్పడ్డాడు
  • సోమిరెడ్డి జీవితమే అవినీతిమయం
  • కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు..వదిలే ప్రసక్తే లేదు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి
హైదరాబాద్ః టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి అవినీతిపరుడు నెల్లూరు జిల్లాలోనే లేడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. చంద్రమోహన్ రెడ్డి అవినీతి జిల్లాలో కొండెక్కి కూర్చుందని కాకాని చెప్పారు.  సోమిరెడ్డి విదేశాల్లో జరిపిన లావాదేవీలు, అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు పెట్టడంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీకి అందజేశామని చెప్పారు.  చట్టాలకతీతంగా హవాలా ద్వారా చంద్రమోహన్ రెడ్డి మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని కాకాని విమర్శించారు. సోమిరెడ్డికి ధైర్యం ఉంటే తాను చేసిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అవకతవకలపై నిజాలు నిగ్గు తేల్చే సంస్థలకు వద్దకు పోకుండా... ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటూ సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పీఎస్ లో ఫిర్యాదు చేయడం, డీజీపీని కలవడం హ్యాస్యాస్పదమన్నారు. తన  వద్ద ఉన్న సమాచారం మేరకు ఆధారాలన్నీ ఈడీకి అందించామని, విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కాకాని కోరారు. సీబీఐ, ఈడీతో విచారణకు సిద్ధపడితే వాస్తవాలన్నీ బయటకొస్తాయనే సోమిరెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడని కాకాని ఎద్దేవా చేశారు.  ఎమ్మెల్సీ పదవి నుంచి సోమిరెడ్డిని తొలగించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. తన అవినీతి కూపం నుంచి బయటపడేందుకు సోమిరెడ్డి జిల్లాలో కేసును తొక్కిపెట్టాలని చూస్తున్నాడని కాకాని గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నీవు చేసిన ఆరోపణలపై ఆధారాలు లేవని ఒప్పుకో...? లేదా ఆ ఆధారాలను బయటపెట్టు...? అలా గాకుండా ఏది బడితే అది మాట్లాడుతూ  అధికారంతో బయటపడాలని నీచపని చేస్తే ప్రజలు మిమ్మల్ని చీకొట్టే రోజు వస్తుందని సోమిరెడ్డిని హెచ్చరించారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాకాని గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ...పరువు నష్టం కేసు వేస్తానన్న సోమిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  నీపై పరువునష్టం కేసు వేస్తే విదేశాల్లో ఉన్న నీ నల్లడబ్బు కూడా చాలదు కట్డడానికి అని ఎద్దేవా చేశారు. నీ జీవితమే అవినీతికి పాల్పడడం అవతలి వాళ్లపై ఆరోపణలు చేయడం, బురజల్లడమని దుయ్యబట్టారు.  నకిలీ పేరు చెప్పి బయటపడాలని చూస్తే పప్పులుడకని సోమిరెడ్డికి కాకాని వార్నింగ్ ఇచ్చారు. దేశంలో సోమిరెడ్డికి తన పేరుతో ఓ పవర్ ప్రాజెక్ట్, ఆయన సతీమణి జ్యోతి పేరుతో 3 కంపెనీలు, తన కొడుకుకు 10 కంపెనీలున్నాయని కాకాని వివరించారు. కుటుంబ ఆస్తులు అన్నీ అమ్ముకున్నా మానాయన ఇచ్చిన ఇళ్లు తప్ప ఏమీ లేదన్న సోమిరెడ్డికి.... ఇన్ని కంపెనీలు, ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయి అని అడిగితే సమాధానం దాటవేస్తున్నాడని కాకాని పేర్కొన్నారు. ఇవి కూడా నకిలీయేనా సోమిరెడ్డి అంటూ చురక అంటించారు. సోమిరెడ్డి చరిత్రంతా కాకాని బట్టబయలు చేశారు. గతంలో నీరు- చెట్టు పథకంలో  12శాతం కమీషన్ లు తీసుకున్నాడని,  సోమిరెడ్డి అవినీతి గురించి సొంత పార్టీ వాళ్లే కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. జిల్లాలో కమీషన్ లకు కక్కుర్తి పడి ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లు 4 శాతాన్ని ఎక్కువకు కోడ్ చేసి ప్రజాధనాన్ని దోచుకున్నాడని ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్నప్పుడు నకిలీ ఎరువుల కుంభకోణం, పనికి ఆహార పథకంలో బియ్యం దోపిడీ, క్రికెట్ కిట్లు అమ్ముకున్న నీచ చరిత్ర సోమిరెడ్డిదని కాకాని నిప్పులు చెరిగారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులను ఆడిపోసుకోవడం మానుకోవాలని సోమిరెడ్డిని హెచ్చరించాకు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మసులుకోవాలని సూచించారు. 

Back to Top