టీడీపీ ప్రలోభాలపై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్‌: నంద్యాల ఉప ఎన్నిక‌లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శివకుమార్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర‌ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు వినతిపత్రం అందజేశారు. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధం లేని  టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు నంద్యాలలో తిరుగుతున్నారని ఆధారాలతో సహా ఆయనకు అందించారు. దీనిపై విచారణ జరపాలని కోరారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ..నంద్యాల జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి టీడీపీ అక్రమాలకు తెరలేపిందన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ బనగానపల్లి ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ప్రతి పోలింగ్‌ బూత్ వ‌ద్ద‌కు వెళ్లి ఓటర్లను ప్రలోభపెడుతున్నార‌ని తెలిపారు.

Back to Top