పరిటాల సునీతపై ఫిర్యాదు

అనంతపురం:

 ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి  జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరు కోసం ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో స్ధానికంగా రైతు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుసభను అడ్డుకునేందుకు మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్, టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎస్పీకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. దీంతో రామగిరిలో గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  శాంతియుతంగా నిర్వహించేందుకు తలపెట్టిన రైతుసభను అడ్డుకోవడం సమంజసం కాదని ప్రకాశ్రెడ్డి అన్నారు.

Back to Top