ఇదెక్కడి న్యాయం

అనంతపురం అర్బన్‌: రైతుల అనుమతి లేకుండా వారి పొలాల్లో విద్యుత్‌ స్తంబాలను ఏర్పాటు చేసి రైతులకు గాలిమరల కంపెనీ అన్యాయం చేస్తోందని బాధిత రైతు కె.సి.మల్లికార్జున, వైయఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.చిన్నపెద్దన్న, రామగిరి మండల వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ నాగరాజు అన్నారు. పొలాలు తమకు చెందినవి కావంటూ విచారణ చేసిన పోలీసు అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసిందన్నారు. వాస్తవంగా మా భూములు పెద్ద ఆస్తి అని, 1బి, వెబ్‌ల్యాండ్‌లో కూడా ఉన్నాయన్నారు. న్యాయం చేయాలని కోరితే పోలీసులు కూడా కంపెనీకి అనుకూలంగా వ్యహరిస్తే కేసు కూడా తీసుకోలేదన్నారు. ఇదేమని అడిగితే ఇబ్బంది పెట్టారని, దీంతో మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించామన్నారు.

తాజా ఫోటోలు

Back to Top