ఎఫ్ 1, జి గేట్ల నుంచి ప్రజలకు ప్రవేశం

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ.. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సమైక్య శంఖారావం బహిరంగ సభను నేడు ఎల్బీ స్టేడియంలో నిర్వహి‌స్తోంది. ఈ సభకు హాజరయ్యే వారి కోసం స్టేడియంలో ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసినట్లు పార్టీ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఫతేమైదాన్ వైపు ఉన్న 'ఏ గేట్' నుంచి‌ మహిళలు ప్రవేశించాలని, నిజాం క్లబ్ వైపు ఉన్న 'ఎ‌ఫ్ గేట్' నుంచి వీఐపీలు, కేఎ‌ల్కే ‌భవనం వైపు ఉన్న 'డీ గేట్' నుంచి వీవీఐపీలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో పార్టీ పేర్కొంది. బషీర్బా‌గ్ ప్రె‌స్‌క్లబ్ వైపు‌న ఉన్న 'ఎఫ్ 1 గేట్'తో పాటు ఆయకార్ భవ‌న్ వైపు ఉన్న 'జీ గేట్ 'నుంచి ప్రజలు ప్రవేశించేందుకు వీలుగా ఎల్బీ స్టేడియంలో ప్రవేశ ద్వారా‌లు ఏర్పాటు చేసినట్లు పార్టీ పేర్కొంది. సమైక్య శంఖారావం సభా ప్రాంగణం ఎల్బీ స్టేడియానికి హైదరాబాద్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత బూర్గుల రామకృష్ణారావు ప్రాంగణంగా ‌పేరుపెట్టారు. పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర ముఖ్య నేతలు ఆసీనులయ్యే వేదికకు తెలుగువారందరికీ ఒకే రాష్ట్రం కావాలంటూ ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టినట్టు పార్టీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

Back to Top