రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం

– స్పీకర్‌కు వివరించి ఆమోదించుకుంటాం
– రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీ వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే
– రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి
– రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు
– వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
  
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ద్రోహాన్ని నిరసిస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేశాం. దానికే కట్టుబడి ఉంటామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌  నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ రాజీనామాలకు కట్టబడి ఉంటామన్నారు. స్పీకర్‌కు కూడా అదే వివరిస్తామని తెలిపారు. స్పీకర్‌కు మా రాజీనామాలు ఆమోదించక తప్పని పరిస్థితిని కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై ఆయన ధ్వజమెత్తారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి.. బీజెపీతో అంటకాగి ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నంత మాత్రాన చంద్రబాబును జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాసం తీర్మాణాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు.. వారూ మద్ధతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాలుగేళ్లుగా మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే ప్రత్యేక హోదాపై పోరాడుతున్నదని తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి వైదొలిగారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశమే లేదని అన్నారు. ఓటుకు నోటు కేసు, కాగ్‌ రిపోర్టు, ఇతర కేసులకు భయపడుతున్న చంద్రబాబు అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం లేదని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు మేకపాటి పేర్కొన్నారు. చంద్రబాబుకు కావాల్సిందంతా సొంత ప్రయోజనాలు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే చంద్రబాబు నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనైతికంగా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబుకు విలువలు ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి, అనైతిక చర్యలను ప్రజలు గమనించారని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ప్రత్యేక హోదా సహా అన్ని విభజన హామీలు నెరవేర్చే సత్తా వైయస్‌ఆర్‌సీపీకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top